L2E Empuraan: మలయాళం లో లూసిఫర్ ను తెరకెక్కించిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాకు సిక్వెల్ గా ఎంపురాన్ -2 ను తెరకేక్కించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ‘ఎల్2 ఎంపురాన్’ గ్లిమ్స్, పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. మార్చి 27న ఎల్ -2 ఎంపురాన్ పాన్ ఇండియా బాషలలో రిలీజ్ కానుంది. ఎంపురాన్ సూపర్బ్ గా ఉండబోతుందట. ఈ సినిమా తర్వాత పృథ్వీరాజ్ పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచుకుంటాడని మాలీవుడ్ సినీవర్గాలలో చర్చ నడుస్తోంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఎంపురాన్ మాలీవుడ్ గత సినిమాలు సృష్టించిన రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న ఎంపురాన్ సినిమాతో పృథ్వీరాజ్ సుకుమారన్ ఎలాంటి బ్లాక్ బస్టర్ అందుకుంటాడో చూడాలి.
