LPG Gas Price Today

LPG Gas Price Today: నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

LPG Gas Price Today: ప్రతి ఇంటి నిత్యావసరాల్లో ముఖ్యమైనది వంట గ్యాస్. ఈ గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరల ఆధారంగా నెలనెలా మారుతుంటాయి. ప్రతి నెలా 1వ తేదీకి ముందే గ్యాస్ ధరల్లో మార్పు ఉంటుందేమోనని ప్రజలు ఆశగా ఎదురుచూస్తారు. కానీ చాలాసార్లు ఎలాంటి తగ్గింపు లేకపోవడంతో నిరాశే మిగిలిపోతుంది.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గ్యాస్ ధరల పెంపుతో సామాన్యులపై మళ్ళీ భారం పడింది. గృహ వినియోగం కోసం వినియోగించే 14.2 కేజీల సిలిండర్‌పై రూ.50 పెంచుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిర్ణయం ఏప్రిల్‌ 1 నుండి అమలులోకి వచ్చింది.

ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వివిధ పట్టణాల్లో గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం:

  • హైదరాబాద్: ₹905

  • వరంగల్: ₹924

  • విశాఖపట్నం: ₹861

  • విజయవాడ: ₹875

  • గుంటూరు: ₹877

పెరిగిన ధరల వల్ల మధ్య తరగతి ప్రజలు బడ్జెట్‌ను సమతుల్యం చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి ముడి చమురు ధరలు ప్రపంచవ్యాప్తంగా క్రమంగా స్థిరపడుతుండగా, దేశీయంగా ధరలు తగ్గే అవకాశం ఉందని ఆశించినా, ఆ ప్రభావం వంట గ్యాస్‌పై కనిపించడంలేదు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pakistani Tourists: ఇక పాకిస్తానీలు తాజ్ మహల్ చూడటానికి రాకూడదు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *