Lovers Suicide: ప్రేమించిన వ్యక్తితో పెళ్లికి అమ్మ ఒప్పుకోదు అని తెలిసి యువతి ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది.ఈ దారుణ ఘటన విశాఖపట్నం లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే
ఇదివరకే పెళ్లయిన ఉద్దీన్ ఖాన్ (36) వెంకట దుర్గ అనే యువతిని ప్రేమించడంతో తన భార్యకి నెల రోజుల ముందుగానే విడాకులు కూడా ఇచ్చాడు. సింహాచలంలోని గోశాల వద్ద టిఫిన్ దుకాణం నడుపుతున్న పిన్నింటి జయశ్రీ దగ్గర ఏడాదిగా చెఫ్ గా పనిచేస్తున్నాడు. టిఫిన్ షాప్ వచ్చే ఆమె కూతురితో చనువుగా ఉండేవాడు.. కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆమెను ప్రేమలోకి దించాడు.కూతురితో క్లోజ్ గా ఉండడం చుసిన పిన్నింటి జయశ్రీ అనుమానం రావడంతో ఉద్దీన్ ఖాన్ ని పనిలోంచి తీసేసింది.
ఇది కూడా చదవండి: Gold Soil Scam: బంగారు ఇసుక.. ఐదు బస్తాలు జస్ట్ 68 లక్షలు మాత్రమే.. నిండా ముంచేశారు!
తర్వాత కూతురికి పెళ్లి చేయాలి అని నిర్ణయించుకున్న తల్లి పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టింది. దింతో తన ప్రేమ పెళ్ళికి అమ్మ ఒప్పుకోదు అని నిర్ణయించుకున్న యువతి. తల్లి టిఫిన్ దుకానికి వెళ్లిన వెంటనే.. వడ్లపూడిలో ఉన్న ప్రియుడి ఇంటికి వెళ్ళింది. అక్కడ ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకోవడానికి ఇద్దరు అదే గదిలో సూసైడ్ చేసుకున్నారు.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు దువ్వాడ పోలీసులు. పోస్టుమార్టం కోసం మృత దేహాలను కేజీహెచ్ కు తరలించారు.