Love affair: బీటెక్ చదివేందుకు వచ్చిన ఓ విద్యార్థి (19)తో అదే కాలేజీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేసే మహిళ కలిసి వెళ్లిపోయింది. ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లకే ఇద్దరూ కలిసి ఎటో వెళ్లిపోయారు. ఆ విద్యార్థి బెంగళూరు వెళ్తున్నట్టు కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఎంతకూ రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆరా తీయగా, అసలు విషయం బయటకొచ్చింది.
Love affair: ఏపీలోని చిత్తూరులో ఓ ప్రైవేటు కాలేజీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా ఓ మహిళ (38) పనిచేస్తున్నది. ఆమె భర్త నుంచి విడిపోయి ఒంటరిగానే ఉంటున్నది. అదే కాలేజీలో విద్యార్థి (19) బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతడికి ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేసే మహిళతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమలో పడిపోయారు.
Love affair: గత మే నెలలో బెంగళూరులో ఇంటర్న్‌షిప్ కోసం వెళ్తున్నట్టు తల్లిదండ్రులకు చెప్పి, ఆ ల్యాబ్ టెక్నీషియన్ అయిన మహిళతో వెళ్లిపోయాడు. ఎన్నాళ్లయినా ఆ యువకుడు రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు ఆరా తీశారు. ఈ సమయంలో అసలు విషయం వారికి తెలిసింది. ఆ మహిళతో వెళ్లిన విషయం తెలిసిన ఆ యువకుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Love affair: బీటెక్ విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చిత్తూరు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ బెంగళూరులో ఉంటున్నట్టు గుర్తించి, ఇద్దరినీ చిత్తూరుకు తీసుకొచ్చారు. విద్యార్థి, ఆ మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిండ్లకు పంపించారు. ఆ విద్యార్థిని తల్లిదండ్రులు తీసుకెళ్లారు.

