Madurai: మధురై నగరం ఈరోజు సనాతన ధర్మ భక్తులతో కిటకిటలాడనుంది. హిందూ మున్నణి సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం మధురైలో ‘మురుగన్ మహా భక్త సమ్మేళనం’ ఘనంగా జరగనుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తి ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ మహాసమ్మేళనానికి దక్షిణాదినే కాదు, దేశం నలుమూలల నుండి భక్తులు భారీగా హాజరవుతున్నారు.
అమ్మ తిడల్, పాండి కొవిల్ సమీపంలోని విస్తీర్ణ ప్రాంగణంలో నిర్వహించే ఈ మహాసభకు దాదాపు ఐదు లక్షల మంది భక్తులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ నుంచి భక్తుల రాకతో మధురై ఒక పుణ్యక్షేత్రంగా మారింది.
ఇది కూడా చదవండి: Operation Sindhu: కొనసాగుతున్న ఆపరేషన్ సింధు.. 1,117 మంది భారతీయుల తరలింపు
ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సేవ్ టెంపుల్స్ భారత్ జాతీయ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ ముగ్గురు నేతలు గత 15 రోజులుగా ఉపవాస దీక్షలతో భక్తి శక్తిని ప్రతిబింబిస్తున్నారు.
మహా సమ్మేళనం సందర్భంగా వివిధ రాష్ట్రాల కళాకారులు తమ సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరిస్తారు. భజనలతో, పాటలతో, నాట్యాలయ ప్రదర్శనలతో మధురై నగరం ఆధ్యాత్మికతలో నిమగ్నమవుతుంది.
సనాతనధర్మ హిందూ బంధువులు భక్తి భావంతో పాల్గొని మురుగన్ కృప పొందాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు