Mithun Reddy

Mithun Reddy: ఢిల్లీ లిక్కర్ కేసు: రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ!

Mithun Reddy: ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజంపేట లోక్‌సభ సభ్యుడు మిథున్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేయడంతో, పోలీసులు ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

ఈ లుకౌట్ నోటీసుల ప్రకారం, మిథున్ రెడ్డి దేశం విడిచి వెళ్లాలంటే తప్పనిసరిగా కోర్టు లేదా సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి, ఈ కేసులో బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, న్యాయస్థానం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో ఆయన విదేశాలకు వెళ్లే అవకాశాలను నిరోధించేందుకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.

Also Read: Pemmasani Records: శ్రీమంతుడే కాదు ప్రజాసేవలో పనిమంతుడు కూడా..

ఈ పరిణామం రాజంపేట ఎంపీకి పెద్ద షాక్‌గా ఇచ్చింది. ప్రస్తుతం లిక్కర్ కేసులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ లుకౌట్ నోటీసులు మిథున్ రెడ్డిపై ఒత్తిడిని మరింత పెంచే అవకాశం ఉంది. ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Coimbatore Bomb Blast Case: 1998 కోయంబత్తూరు బాంబు పేలుడు కేసులో కీలక నిందితుడు అరెస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *