Anil Ambani

Anil Ambani: అనిల్ అంబానీపై లుకౌట్ సర్క్యులర్ జారీ

Anil Ambani: ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి ఎదురుదెబ్బ తగిలింది. పలు బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని మోసం చేశారన్న ఆరోపణలు, అలాగే మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాలు ఆయనపై వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, అనిల్ అంబానీపై అధికారులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు.

ఈ నెల 5న ఈడీ విచారణకు అనిల్ అంబానీ
ఈ కేసుల పరంపరలో ఇప్పటికే అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 5వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ ఆ నోటీసుల్లో స్పష్టం చేసింది. ఈ పరిణామాలు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *