Kodali Nani: కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ కొడాలి నానిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన కదలికలపై నిఘా పెట్టాలని తెదేపా ఫిర్యాదు చేసింది. ఈ మేరకు డీజీపీకి తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులో, కొడాలి నాని అనారోగ్య సమస్యల పేరుతో అమెరికా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయన పాస్‌పోర్టును సీజ్ చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ కొడాలి నానిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
Also Read: Bengaluru: బెంగళూరులో కలకలం… సూట్ కేసులో మైనర్ బాలిక మృతదేహం
Kodali Nani: రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై పెద్ద ఎత్తున కేసులు నమోదైన క్రమంలో దేశం విడిచి వెళ్లకుండా ఎయిర్‌పోర్టులు, ప్రధాన పోర్టులకు పోలీసులు లుక్ అవుట్ నోటీసులపై సర్క్యులర్ జారీ చేశారు. ఇటీవలే ముంబైలో కొడాలి నానికి హార్ట్‌కు శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.