Coolie: సూపర్‌స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో రూపొందుతున్న భారీ చిత్రం ‘కూలీ’ హిందీ వెర్షన్ టైటిల్ మార్పు సంచలనం రేపింది. ఈ పాన్ ఇండియా మూవీని సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా, నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, ఆమీర్ ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 14న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం హిందీలో ‘మజ్దూర్’ టైటిల్‌తో రాబోతోంది. గతంలో అమితాబ్ బచ్చన్ నటించిన ‘కూలీ’ (1983) సినిమా సంచలన విజయం సాధించడంతో, టైటిల్ గందరగోళం నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, ‘మజ్దూర్’ టైటిల్‌పై నార్త్ ఆడియన్స్‌లో మిశ్రమ స్పందన వస్తోంది. ఈ పేరు రజనీ మాస్ ఇమేజ్‌కు కనెక్ట్ కాకపోవచ్చని, క్లాస్ టోన్‌లో ఉందని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాంతో వెంటనే ఈ టైటిల్ ని ‘ది పవర్ హౌస్’ గా మార్చినట్లు సమాచారం. టైటిల్ మార్పు ఈ హైప్‌ను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి!
