Lokesh Kanagaraj: కార్తీ ‘ఖైదీ’ చిత్రం 25తో ఐదేళ్ళు పూర్తి చేసుకుంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో డ్రీమ్ వారియన్ పిక్చర్స్ పతాకంపై ప్రకాశ్, ఎస్.ఆర్. ప్రభు నిర్మించిన ఈ చిత్రంలో నరేన్, రమణ, హరీశ్, జార్జ్ ముఖ్య పాత్రలు పోషించారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ ఘన విజయం సాధించింది. యావజ్జీవ కారాగార శిక్ష పడ్డ ఖైదీ సత్ ప్రవర్తన తో ముందుగా రిలీజ్ అయి తన పాపను చూడాలని బయలుదేరినప్పుడు ఓ పెద్ద ప్రమాదం నుంచి 40 మంది పోలీస్ అధికారులను కాపాడవలసిన బాధ్యత తనపై పడుతుంది. ఆ పనిని తను ఎలా నిర్వర్తించాడు? కూతుర్ని కలిశాడా? అనే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. ఐదేళ్ళు పూర్తయిన సందర్భంగా దర్శకుడు లోకేష్ ట్వీట్ చేస్తూ ‘అంతా ఇక్కడ నుంచే ప్రారంభమైంది. కార్తీ, ఎస్.ఆర్ ప్రభుకు థ్యాంక్యూ. వీరి వల్లే లోకేష్ యూనివర్శల్ సాధ్యమైంది. త్వరలోనే ఢిల్లీ తిరిగి రాబోతున్నాడు’ అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం రజనీకాంత్ తో ‘కూలీ’ తీస్తున్నాడు లోకేష్ కనకరాజ్. ఆ సినిమా పూర్తి కాగానే ‘ఖైదీ2’ మొదలు అవుతుందన్న మాట.
It all started from here! 💥💥
Grateful to @Karthi_Offl sir, @prabhu_sr sir and the ‘universe’ for making this happen 🤗❤️
Dilli will return soon 🔥#5YearsOfKaithi pic.twitter.com/Jl8VBkKCju
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) October 25, 2024