Lokesh Kanagaraj: రజినీకాంత్, కమల్ హాసన్‌లను లోకేష్ కనగరాజ్ ఒకే తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ కోసం లోకేష్ ఇప్పటికే ఎన్నో ప్లాన్‌లు సిద్ధం చేస్తున్నారని సమాచారం. అవి కచ్చితంగా అభిమానులను థ్రిల్ చేస్తాయట. ‘కూలీ’ సినిమా తర్వాత గ్యాప్ తీసుకుంటానన్న లోకేష్, ఈ భారీ కాంబినేషన్‌తో స్ట్రాంగ్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. కైతి 2 తరువాత దీనిపై గట్టిగా ఫోకస్ చేయనున్నాడు. త్వరలో ఈ ప్రాజెక్ట్ గురించి పెద్ద అధికారిక అప్డేట్ రానుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో బజ్ నడుస్తోంది.
