Coolie: సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న భారీ అవైటెడ్ చిత్రం ‘కూలీ’ కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రూపొందిస్తున్న ఈ పాన్-ఇండియా మూవీలో రజినీతో పాటు నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర వంటి బిగ్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా లోకేష్ ఈ సినిమాపై ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు.
ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర వంటి నటులు కేవలం క్యామియో రోల్స్‌లో కాకుండా, కథకు బలమైన కనెక్షన్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారని లోకేష్ స్పష్టం చేశారు. “‘విక్రమ్’లో సూర్య, ఫహద్ ఫాజిల్ పాత్రలు కథతో ఎలా ముడిపడ్డాయో, ‘కూలీ’లోనూ అన్ని పాత్రలు అలాగే కీలకంగా ఉంటాయి. థియేటర్స్‌లో సినిమా చూస్తే ప్రేక్షకులకు అర్థమవుతుంది,” అని లోకేష్ వెల్లడించారు. ఈ అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌లో ఉత్సాహం రెట్టింపైంది. ‘కూలీ’ రిలీజ్ కోసం ఎదురుచూపు మరింత పెరిగింది!
