Nara lokesh: ప్రజలు ఇప్పుడు తేడా తెలుసుకుంటున్నారు

రాష్ట్రంలో కల్తీ మద్యం అంశంపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలకు ఐటీ, గ్రామీణ అభివృద్ధి మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా తీవ్ర ప్రతిస్పందన వ్యక్తం చేశారు. కల్తీ మద్యం గురించి, నిందితులకు వత్తాసు పలికే జగన్‌కు నైతిక అర్హత లేదని ఆయన మండిపడ్డారు.

“కల్తీ మద్యం కేసులో చర్యలు మా ప్రభుత్వం తీసుకుంది”

లోకేశ్ స్పష్టం చేస్తూ, “కల్తీ మద్యం పట్టుబడింది, నిందితులు అరెస్ట్ అయ్యారు — ఇవన్నీ మా ప్రభుత్వ కాలంలోనే జరిగాయి” అని చెప్పారు.

ఈ కేసులో టీడీపీకి చెందిన ఇద్దరు నేతలు ఉన్నప్పటికీ, వారిపై తక్షణ కఠిన చర్యలు తీసుకుని పార్టీ నుంచి సస్పెండ్ చేశాం అని వివరించారు.

“కానీ జగన్ తన ఐదేళ్ల పాలనలో కల్తీ మద్యం మాఫియాలను కాపాడి, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారు. ఇప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు,” అని లోకేశ్ విమర్శించారు.

బ్రాండ్ల’తో ప్రజల ప్రాణాలతో చెలగాటం

 

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో డబ్బు కోసం “జే బ్రాండ్ల”ను ప్రవేశపెట్టి, వాటి ద్వారా వేలాది మందిని ప్రాణాలు కోల్పోయేలా చేశారని లోకేశ్ ఆరోపించారు.

జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి పలువురు మరణించిన ఘటనను గుర్తుచేస్తూ, “ఆ మరణాలను సహజ మరణాలుగా చూపించి నిందితులను కాపాడారు” అని అన్నారు.

 

అప్పటి మంత్రి జోగి రమేశ్ బాధితుల పట్ల అహంకారంగా మాట్లాడిన విధానం ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదని లోకేశ్ వ్యాఖ్యానించారు.

 

దళిత డ్రైవర్ హత్య కేసుపై విమర్శలు

 

దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పార్టీ నుంచి కనీసం సస్పెండ్ చేయలేదని లోకేశ్ గుర్తుచేశారు.

“అలాంటి వ్యక్తిని ఇంటికి పిలిపించి భోజనం పెట్టి సత్కరించిన జగన్‌కు, నైతికత గురించి మాట్లాడే హక్కు ఎక్కడుంది?” అని ఆయన ప్రశ్నించారు.

జగన్ ట్వీట్‌కు లోకేశ్ ఘాటైన బదులు

రాష్ట్రంలో కల్తీ మద్యం ఘటనలపై జగన్ నిన్న చేసిన ట్వీట్‌కు బదులుగా లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

“ప్రజలు ఇప్పుడు తేడా తెలుసుకుంటున్నారు – ఎవరు నిజంగా చర్యలు తీసుకుంటున్నారు, ఎవరు మాటలకే పరిమితమవుతున్నారు,” అని లోకేశ్ వ్యాఖ్యానించారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *