Lokesh: నేపాల్‌లో రాజకీయ ఉద్రిక్త పరిస్థితుల మధ్య 217 మంది ఆంధ్రులు చిక్కుకుపోయినట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. వీరంతా నేపాల్‌లోని 12 ప్రాంతాల్లో ఉన్నారని తెలిపారు. అందులో ఖాట్మండులో 173 మంది, హిటాడోలో 22 మంది, పోక్రాలో 10 మంది, సినికోట్‌లో 12 మంది ఉన్నారని వివరించారు. ప్రస్తుతం ఢిల్లీ నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని, నేపాల్‌లోని భారతీయులను సురక్షితంగా తరలించే బాధ్యత రామ్మోహన్ తీసుకున్నారని లోకేష్ చెప్పారు. ఈ క్రమంలో నేపాల్ ఎంబసీతో సమన్వయం చేసుకుని, అందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చే చర్యలు జరుగుతున్నాయని ఆయన భరోసా ఇచ్చారు
.

