Local Body Elections:స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసే పనిలో పడింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ జిల్లాలకు మార్గదర్శకాలను పేర్కొంటూ జీవో జారీచేసింది. నిన్న జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ రామకృష్ణారావు విధి విధానాలను వివరించారు.
Local Body Elections:స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతం వరకు కేటాయిస్తూ ఆ జీవోలో పేర్కొన్నారు. ఈ రిజర్వేషన్లను 2024 సమగ్ర కుటుంబ సర్వే వివరాల ప్రకారం కేటాయించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మాత్రం 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లను కేటాయించాలని ఆదేశాలను జారీ చేశారు. ఈ మేరకు ఆయా వర్గాల రిజర్వేషన్ల జాబితాను ఈ రోజు (సెప్టెంబర్ 23) సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
Local Body Elections:రాష్ట్రంలో 31 జడ్పీ, 565 జడ్పీటీసీ, 5,763 ఎంపీటీసీ, 12,760 సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేసే పనిలో జిల్లాల కలెక్టర్లు, ఇతర ఎన్నికల అధికారులు నిమగ్నమయ్యారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30లోగా ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టాలని, అక్టోబర్‌లోగా ఎన్నికలను ముగించాలన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని తెలుస్తు్నది.