Local Body Elections: పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ఊపు మీదున్న అధికార కాంగ్రెస్ పార్టీ మిగతా స్థానిక సంస్థల ఎన్నిలపై సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై కసరత్తు చేస్తున్న సర్కారు.. మున్సిపల్ ఎన్నికలపైనా సంసిద్ధమవుతున్నది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు ముందు ప్రక్రియలో అధికారులను నిమగ్నం చేసింది.
Local Body Elections: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పాలకవర్గం గడువు 2026 ఫిబ్రవరి నెలతో ముగియనున్నది. ఈ మేరకు ఇప్పటికే ముగిసిన పట్టణ స్థానిక సంస్థలన్నింటికీ కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ముఖ్యంగా విద్యార్థుల పరీక్షల సీజన్ మొదలుకాక ముందే ఎన్నికల ప్రక్రియను ముగించాలని కూడా యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. దీంతో ఫిబ్రవరి రెండో వారంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకే సర్కారు మొగ్గు చూపుతుందని భావిస్తున్నారు.
Local Body Elections: ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలోని రెండు మున్సిపాలిటీల పాలకవర్గాలకు 2026 ఏప్రిల్ నెల వరకు గడువు ఉన్నది. దీంతో వాటిని ఈ ఎన్నికలకు ప్రభుత్వం మినహాయించాలని భావిస్తున్నది. ఇదిలా ఉండగా, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధంగా ఉండేందుకు జనవరి రెండో వారం కల్లా ఓటర్ల జాబితా తయారీకి ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తున్నది.
