Little Hearts: గత శుక్రవారం విడుదలైన ‘లిటిల్ హార్ట్స్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మౌళి తనూజ్ హీరోగా నటించిన ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తొలిరోజు నుంచే మంచి టాక్‌తో ఈ సినిమా వసూళ్లలో దూసుకెళ్తోంది. బుక్ మై షోలో మూడు రోజుల్లో లక్షల టికెట్లు బుక్ అయ్యాయి. యూత్ థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తోంది? పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Kajal Aggarwal: యాక్సిడెంట్ వార్తలు అవాస్తవం.. నటి కాజల్ అగర్వాల్ స్పందన
‘లిటిల్ హార్ట్స్’ చిత్రం టాలీవుడ్‌లో యూత్‌ను ఆకర్షిస్తూ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. సాయి మార్తాండ్ దర్శకత్వంలో మౌళి తనూజ్ హీరోగా, శివాని నగరం హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ఆదిత్య హాసన్ నిర్మించారు. రాజీవ్ కనకాల, అనిత చౌదరి, సత్యకృష్ణణ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. తొలి వీకెండ్‌లోనే ఈ సినిమా అద్భుతమైన వసూళ్లు రాబట్టింది. బుక్ మై షో ప్లాట్‌ఫామ్‌లో ఇప్పటిదాకా 3 లక్షలకు పైగా టికెట్లు బుక్ అయ్యాయి. యూత్‌ఫుల్ కంటెంట్, రొమాంటిక్ అంశాలతో ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు.

