Wine Shops: హైదరాబాద్ నగరంలో మద్యం ప్రియులకు ఇది ఓ నిరాశ కలిగించే వార్త. పవిత్రమైన శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఏప్రిల్ 6, ఆదివారం రోజున నగరంలోని అన్ని మద్యం దుకాణాలు, బార్లు, కల్లు షాపులు పూర్తిగా మూసివేయనున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.
శ్రీరామనవమి సందర్భంగా నగరంలో పలు చోట్ల శోభాయాత్రలు, భక్తి కార్యక్రమాలు, రామనామ స్మరణలతో అంబరాన్ని కంపించేలా ఉంటాయని అందుకు ముందు జాగ్రత్త చర్యలుగా మద్యం అమ్మకాలను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించారని పోలీసులు తెలిపారు. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.
ఇది కూడా చదవండి: WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
ఇంకా, నిబంధనలు ఉల్లంఘించే వారు ఎవరైనా కఠిన చర్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు. సాధారణ వైన్స్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు షాపులకు ఈ ఆదేశాలు తప్పనిసరి కాగా, స్టార్ హోటల్స్‌లోని బార్లు మరియు రిజిస్టర్డ్ క్లబ్బులు మాత్రం మినహాయింపులోకి వచ్చాయని స్పష్టం చేశారు.
ఈ ఆదేశాలు హైదరాబాద్‌తో పాటు సికింద్రాబాద్ నగరానికి కూడా వర్తిస్తాయని పోలీసులు తెలిపారు. పోలీస్ బలగాలు, ప్రత్యేక పికెట్‌లు, డ్రోన్ల సాయంతో శోభాయాత్ర మార్గాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్టు పేర్కొన్నారు.

