Liquor Shop

Liquor Shop: మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు.

Liquor Shop: తెలంగాణలోని 2,620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులు చివరి రోజు 23 గురువారం రాత్రి వరకు 4822 దరఖాస్తులు వచ్చాయి. ఓబీసీ బంద్‌, పబ్లిక్‌ ట్రాన్స్‌ఫోర్టు బస్సులు నడువక పోవడం, కొన్ని చోట్ల బ్యాంకులు పని చేయక పోవడం లాంటి ఘటనలను దృష్టి ఉంచుకొని ఎక్సైజ్‌ శాఖ మద్యం షాపులకు దరఖాస్తుల గడవు ఈ నెల 23 వరకు పొడగించిన విషయం తెలిసిందే. రంగారెడ్డి డివిజన్‌లో 29,420 అత్యధికంగా రాగా, అదిలాబాద్‌ డివిజన్‌లో 4154 తక్కువగా వచ్చాయి.ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ల, జిల్లా వారిగా మద్యం షాపుల దరఖాస్తుదారుల సమక్షంలో ఈ నెల 27న డ్రా తీయబడును. 27న ఉదయం 11 గంటలకు కలెక్టర్ల సమక్షంలో మద్యం షాపులకు డ్రా తీయబడుతుంది.

Also Read: Telangana Government: రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం .. జాయింట్ కలెక్టర్ పదవి రద్దు!

ఎక్సైజ్‌ జల్లాల వారిగా..
అదిలాబాద్‌లో 771, కోమురం భీమ్‌ అసిఫాబాద్‌లో 680, మంచిర్యాల్‌లో 1712,నిర్మల్‌లో 991, హైదరాబాద్‌లో 3201,సికింద్రాబాద్‌లో 3022, జగిత్యాలలో 1966, కరీంనగర్‌లో 2730, పెద్దపల్లిలో 1507,రాజన్న సిరిసిల్లలో 1381, ఖమ్మంలో 4430,,కొత్తగూడెంలో 3922, జోగులాంబ గద్వాలలో 774, మహబూబ్‌నగర్‌లో 2487, నాగర్‌కర్నూల్‌లో 1518, వనపర్తిలో 757, మెదక్‌లో 1420, సంగారెడ్డిలో 4432, సిద్దిపేట్‌లో 2782, నల్లగొండలో 4906,సూర్యపేట్‌లో 2771,యాదాద్రి భూవనగిరిలో 2776, కామారెడ్డిలో 1502,నిజామాబాద్‌లో 2786,మల్కాజిగిరిలో 5168, మేడ్చల్‌ లో 6063, సరూర్‌నగర్‌లో 7845, శంషాబాద్‌లో 8536, వికారాబాద్‌లో 1808,.జనగామాలో 1697,జయంశంకర్‌ భూపాల్‌పల్లిలో 1863, మహబూబబాద్‌లో 1800,వరంగల్‌ రూరల్‌లో 1958 వరంగల్‌ అర్బన్‌లో 3175 మొత్తంగా 95,137 దరఖాస్తులు వచ్చాయి.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *