Liquor scam: విజయవాడలోని లిక్కర్ స్కాం కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దాఖలు చేసిన చార్జ్‌షీట్‌పై ఏసీబీ కోర్టు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సమాచారం ప్రకారం, కోర్టు సుమారు 21కి పైగా పాయింట్లపై అభ్యంతరాలు తెలిపింది.
ఈ అభ్యంతరాలను నివృత్తి చేస్తూ మూడు రోజుల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ స్కాం కేసులో ఇప్పటివరకు సిట్ రెండు చార్జ్‌షీట్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. జూన్ 19న ప్రాథమిక చార్జ్‌షీట్, ఆగస్ట్ 11న రెండో అదనపు చార్జ్‌షీట్‌ను సమర్పించింది.
ఈ అభ్యంతరాల నేపథ్యంలో కేసు విచారణ మరింత ఆసక్తికరంగా మారింది. సిట్ ఏసీబీ కోర్టు సూచనలను పాటించి నివేదికలు సమర్పించే విధానంపై అన్ని కళ్లూ నిలిచాయి.