Liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో మిథున్‌రెడ్డి అరెస్ట్

Liquor scam: ఆంధ్రప్రదేశ్‌ లో భారీ చర్చకు దారి తీసిన లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అరెస్ట్ చేసింది. ఆయన అరెస్ట్‌ విషయాన్ని కుటుంబ సభ్యులకు సిట్ అధికారులు అధికారికంగా తెలియజేశారు.

మిథున్‌రెడ్డిని రేపు (శనివారం) న్యాయస్ధానంలో హాజరుపర్చనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే ఈ స్కామ్‌లో పలువురు అధికారులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలపై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *