Liquor scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితులు డిఫాల్ట్ బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయాలని నిర్ణయించారు. సమాచారం ప్రకారం, నిందితుల 90 రోజుల జ్యుడీషియల్ కస్టడీ గడువు పూర్తయింది. ఈ నేపథ్యంలో చట్టపరమైన హక్కుగా వారికి లభించే డిఫాల్ట్ బెయిల్ కోసం నిందితులు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఇవాళే ఏ-33 నంబర్ నిందితుడు బాలాజీ గోవిందప్ప తన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. కేసులో ఇప్పటికే పలు మలుపులు తిరుగుతున్న సమయంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. డిఫాల్ట్ బెయిల్ మంజూరు అయితే నిందితులపై విచారణలో ప్రభావం పడే అవకాశం ఉందని న్యాయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.