LIC Rally: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఆధ్వర్యంలో ఈరోజు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జోనల్ మేనేజర్ పునీత్ కుమార్, ఎల్ఐసీ ఈ ర్యాలిని ప్రారంభించారు.
ఇందిరా పార్కు దగ్గరలోని సికింద్రాబాద్ డివిజనల్ ఆఫీస్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ, NTR గ్రైండ్స్ మీదుగా అశోక్ నగర్ వెళ్లి అక్కడ నుండి RTC x Road మీదుగా చిక్కడపల్లి వరకు సాగింది. తిరిగి అదే మార్గంలో వెనుకకు వొచ్చి డివిజనల్ కార్యాలయంలో ముగిసింది.
ఇది కూడా చదవండి: Helmet Challan for Car Driver: హెల్మెట్ లేదు.. చలానా కట్టు.. కారు ఓనర్ కి షాకిచ్చిన పోలీసులు!
LIC Rally: హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న ఉద్యోగులు, డెవలప్మెంట్ ఆఫీసర్లతోపాటు ఏజెంట్లు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పర్యావరణ రక్షణలో మన భాధ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఈ ర్యాలీ సాగింది. సైక్లింగ్ వల్ల పర్యావరణ రక్షణకు తోడ్పడుతూ ఆరోగ్యవంతమైన జీవితాన్నీ పొందవచ్చని ఈ సందర్భంగా పునీత్ కుమార్ చెప్పారు. పిన్నవయస్కులు ఎక్కువ శాతం అనారోగ్యంగా వుంటున్నారని, శారీరికశ్రమ లేకపోవడం దీనికి ఒక ముఖ్యకారణం అని ఆయన అన్నారు. ఇందుకుగాను ప్రతిరోజూ తప్పనిసరిగా యోగా, సైక్లింగ్ అందరూ అలవరచుకోవాలని ఆయన సూచించారు.
మనదేశంలో ట్రాఫిక్ ఏక్సిడెంట్స్ వల్ల చనిపోతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని చెప్తూ, దీనివల్ల కుటుంబాలు అనాధలై పోతున్నాయని అన్నారు. 19 నుండి 50 సంవత్సరాల వయస్కుల ఏక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటున్నాయని, ట్రఫిక్ రూల్స్ అందరూ పాటించాలని పిలుపునిచ్చారు.