Odisha: అటవీ సంరక్షణ చర్యలు ఎన్ని వచ్చినా, జంతు సంరక్షణకు ఎన్ని చట్టాలు తెస్తున్నా వేటగాళ్ల ఉచ్చులో జంతుజాలాలు చిక్కుకొని అంతర్ధానమవుతూనే ఉన్నాయి. రానురాను అటవీ విస్తీర్ణం తగ్గిపోయి క్రూరమృగాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఫలితంగా మనుషుల కంటపడి వేటుకు గురవుతున్నాయి. ఇలా ఎన్నో జింకలు, లేళ్లు, దుప్పులు, కుందేళ్లు తదితర అటవీ జంతుజాలాలు మనిషికి ఆహారంగా మారుతున్నాయి. ఇలాంటి కోవలోనే ఓ చిరుత పులిని వేటగాళ్లు హతమార్చి ఏకంగా దాని మాంసాన్నే వండుకొని తిన్న దుర్ఘటన చోటుచేసుకున్నది.
Odisha: ఒడిశా రాష్ట్రంలోని నౌపడా జిల్లా దియోధరా గ్రామ సమీపంలోని అడవిలో ఈ ఘటన చోటుచేసుకున్నది. ఈ నెల 15న సమీప గ్రామాలకు చెందిన వేటగాళ్లు చిరుతను చంపేశారు. దాన్ని ఒలిచి మాంసాన్ని తీసి వండుకు తిన్నారు. దీనిపై ఫారెస్ట్ అధికారులకు పక్కా సమాచారం అందింది. దీంతో వారిళ్లపై అధికారులు దాడులు చేశారు. మిగిలి ఉన్న చిరుత మాంసాన్ని స్వాధీనం చేసుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.