Lenin

Lenin: లెనిన్ అక్కినేని అభిమానులకు మళ్ళీ నిరాశే?

Lenin: అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని మరోసారి మాస్ అవతారంలో రెడీ అవుతున్నాడు! దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు రూపొందిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అఖిల్ నుంచి బలమైన కంబ్యాక్ ఆశిస్తున్న ఫ్యాన్స్‌కు ఈ చిత్రం ఫుల్ ఎనర్జీతో థియేటర్లలో సందడి చేయనుంది. తాజా సమాచారం ప్రకారం, ‘లెనిన్’ ఈ ఏడాది నవంబర్ 14న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోన్నట్లు తెలుస్తుంది.

అయితే, ఈ రిలీజ్ డేట్‌పై సోషల్ మీడియాలో అభిమానుల నుంచి నిరాశ స్పందనలు వస్తున్నాయి. దసరా, దీపావళి వంటి పండుగ సీజన్‌లో ఈ మాస్ మూవీ రావాలని కొందరు ఆశించగా, నవంబర్ డేట్‌తో కాస్త నిరాశ చెందుతున్నారు. అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అఖిల్ డైనమిక్ లుక్, శ్రీలీల గ్లామర్, మాస్ యాక్షన్ సీన్స్‌తో ‘లెనిన్’ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని టాక్!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hyd News: వేట కొడవలితో ఇద్దరు పిల్లలను హత్య చేసిన తల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *