Bihar: రెచ్చిపోతున్న లారెన్స్ గ్యాంగ్.. చంపుతామని ఎంపీ కి వార్నింగ్

Bihar: లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సెలబ్రిటీల నుంచి పొలిటిషన్లో వరకు అతని గ్యాంగ్ బెదిరింపులకు గురిచేస్తుంది. వాట్సాప్ లో మెసేజ్ చేస్తూ ఇంటర్నెట్ తో ఫోన్లు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా, బీహార్‌లోని పూర్ణియా స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్‌ ను చంపేస్తామంటూ మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఎంపీని చంపడానికి ఇప్పటికే ఆరుగురు వ్యక్తులను పురమాయించామని, ఇదిగో ఈ తుపాకీతోనే అంతమొందిస్తారంటూ బెదిరించారు.

ఈమేరకు పప్పూ యాదవ్‌ పర్సనల్‌ సెక్రెటరీ మహమ్మద్‌ సిద్దిఖ్‌ ఆలమ్‌కు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తి వాట్సాప్‌ మెసేజ్‌ పంపించాడు. టర్కీలో తయారైన ఓ పిస్తోల్‌ ఫొటోను కూడా షేర్‌ చేశాడు. ఎంపీని దీనినితోనే చంపుతారని అందులో పేర్కొన్నాడు. దీంతో ఆయన ఢిల్లీలోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నవంబర్‌ 7న ఉదయం 2.25 నుంచి 9.49 గంటల మధ్య ఈ మెసేజ్‌లు వచ్చాయని తెలిపారు.కాగా, గతంలో కూడా పప్పూ యాదవ్‌ను చంపుతామంటూ బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.

అక్టోబర్‌ 28న లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి తనకు బెరింపు కాల్స్‌ వచ్చాయని ఎంపీ చెప్పారు. చాలాసార్లు ఇలాగే థ్రెట్‌ కాల్స్‌ వచ్చాయని పేర్కొన్నారు. అయితే ఆ కాల్స్‌ చేసిన వ్యక్తిని ఢిల్లీకి చెందిన మహేశ్‌ పాండేగా పోలీసులు గుర్తించారు పోలీసులు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mumbai: 5 కోట్లు ఇచ్చి.. గుడికి వచ్చి దండం పెట్టుకుని పో.. లేదంటే చంపేస్తా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *