Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. సినిమాలకు గ్యాప్ ఇచ్చినా కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. మెగా అభిమానులకు టచ్ లో ఉంటుంది. తాజాగా ఆమె మెగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.
తన కొత్త సినిమాను అనౌన్స్ చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో సినిమా చేస్తుంది లావణ్య. ఈ సినిమాలో హీరోగా మలయాళ నటుడు దేవ్ మోమన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
ఇది కూడా చదవండి: Raw Papaya Benefits: పచ్చి బొప్పాయి రసం.. లాభాలు తెలిస్తే వదలరు!
దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాల సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు సతీలీలావతి అనే టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా ‘సతీ లీలావతి’ షూటింగ్ స్టార్ట్ అయినట్లు వెల్లడించింది లావణ్య.
” సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది” అనే క్యాప్షన్ తో షూటింగ్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.