Ajith-Lokesh: తమిళ సినిమా పరిశ్రమలో సంచలన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం రజినీకాంత్‌తో ‘కూలీ’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అజిత్‌తో సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అజిత్‌తో సినిమా తప్పకుండా ఉంటుందని, సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నానని లోకేష్ తెలిపాడు. రజినీ, కమల్, విజయ్‌లతో హిట్స్ అందించిన లోకేష్, ఇప్పుడు అజిత్‌తో కలిసి మరో బ్లాక్‌బస్టర్‌ను ఎప్పుడు సిద్ధం చేస్తాడన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.
