Akhanda 2: నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న అఖండ 2 తాండవం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంయుక్త, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రం ఇటీవల విడుదలైన టీజర్‌తో మరింత హైప్‌ను క్రియేట్ చేసింది. మొదట సెప్టెంబర్ 25న విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, గ్రాఫిక్స్ పనులు ఆలస్యం కావడం, ఇతర చిత్రాలతో పోటీ తీవ్రంగా ఉండటంతో విడుదల తేదీని మార్చే ఆలోచనలో ఉన్నారు. డిసెంబర్‌లో రాజా సాబ్, హిందీ నుంచి పలు స్టార్ హీరోల చిత్రాలు విడుదలవుతున్నాయి.
Also Read: Stunt Master Dead: స్టంట్ చేస్తుండగా ప్రమాదం.. ప్రముఖ ఫైట్ మాస్టర్ మృతి
ఈ పోటీ మధ్య అఖండ 2 డిసెంబర్ 18న విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఈ వార్తలు ఎంతవరకు నిజమో మేకర్స్ అధికారిక ప్రకటనతోనే తేలనుంది. బాలయ్య హిందీ డబ్బింగ్‌ను స్వయంగా చేస్తూ, నార్త్ మార్కెట్‌పై దృష్టి సారించారు. శివుడి భక్తుడిగా బాలకృష్ణ మరోసారి తన హీరోయిజంతో అఖండ తాండవం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు.