Lady Aghori First Wife

Lady Aghori First Wife: లేడీ అఘోరీ నా భ‌ర్తే.. మీడియా ముందుకొచ్చిన‌ మ‌రో యువ‌తి

Lady Aghori First Wife: ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ పేరిట రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌ర్య‌టించిన లేడీ అఘోరీ అలియాస్ శ్రీనివాస్‌.. ఇటీవ‌ల ఓ యువ‌తిని పెళ్లి చేసుకున్న సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. శ్రీవ‌ర్షిణి అనే యువ‌తిని ఆ అఘోరీ తీసుకెళ్ల‌గా వారి బంధువులు వెతుక్కుంటూ వెళ్లి గుజ‌రాత్‌లో గుర్తించి తీసుకొచ్చారు. అయితే లేడీ అఘోరీ త‌న‌నే ముందుగా పెళ్లి చేసుకున్నాడ‌ని, మ‌రో యువ‌తిని ఎలా పెళ్లి చేసుకుంటుంద‌ని మ‌రో యువ‌తి మీడియా ముందుకొచ్చింది. లేడీ అఘోరీ త‌న భ‌ర్తేన‌ని ఆ యువ‌తి చెప్తున్న‌ది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Lady Aghori First Wife: లేడీ అఘోరి త‌న‌ను గ‌త జ‌న‌వ‌రి నెల‌లో పెళ్లి చేసుకున్న‌ట్టు ఆ యువ‌తి సోమ‌వారం (ఏప్రిల్ 14న‌) మీడియా ముందు వెల్ల‌డించింది. లేడీ అఘోరీని తాను భ‌ర్త‌గా భావించిన‌ట్టు తెలిపింది. శ్రీ వ‌ర్షిణిని పెళ్లి చేసుకున్న‌ట్టు త‌న‌కు తెలియ‌డంతో తాను బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్టు ఆ యువ‌తి తెలిపింది. పోలీస్ శాఖ‌, ప్ర‌భుత్వం ఈ విష‌యంలో త‌న‌కు న్యాయం చేసి, అఘోరీపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆ యువ‌తి కోరింది.

Lady Aghori First Wife: హిందూత్వాన్ని కాపాడుతానంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ ఈ లేడీ అఘోరీ నానా హంగామా చేసింది. అయితే పోలీసులు కూడా సున్నితంగానే ఆ లేడీ అఘోరీ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తూ వ‌చ్చారు. అయితే ఇటీవ‌ల ఓ యువ‌తిని ట్రాప్ చేసి త‌న వెంట తీసుకెళ్ల‌గా ఆ అఘోరీ బండారం బ‌య‌ట‌కొచ్చింది.

Lady Aghori First Wife: ఆ యువ‌తిని తాను పెళ్లి చేసుకున్నాన‌ని, తాము క‌లిసి జీవితాంతం ఉంటామంటూ చెప్పుకొచ్చింది. దీంతో విస్తుపోవ‌డం జ‌నం వంత‌యింది. కుటుంబ స‌భ్యులు ఆ యువ‌తిని ఇంటికి తీసుకొచ్చినా మ‌ళ్లీ త‌ప్పించుకొని ఆ యువ‌తి అఘోరీ చెంత‌కే చేర‌డంతో వివాదం మ‌రింత ర‌చ్చ‌కెక్కింది. ఇలాంటి ద‌శ‌లో లేడీ అఘోరీ త‌న‌నే మొద‌టి వివాహం చేసుకున్న‌ట్టు మ‌రో యువ‌తి విష‌యం వెలుగులోకి రావ‌డంతో అఘోరీ అస‌లు బాగోతం ఏమిటి? అనే విష‌యాల‌పై ఆస‌క్తి పెరిగింది. లోతుగా విచారిస్తూ ఆ అఘోరీ బండారం బ‌య‌ట‌కొచ్చే అవ‌కాశం ఉన్న‌ద‌ని రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు భావిస్తున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  TATA group: టాటా గ్రూప్ మృతుల కుటుంబాలకు కోటి ఎక్స్‌గ్రేషియా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *