latest Telugu news: ఇద్దరు పిల్లలతో కలిసి భార్యాభర్తలు ఎంచక్కా కారులో హైదరాబాద్ నిజాంపేట నుంచి విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్తున్నారు. కారు హైదరాబాద్ దాటి అవుటర్ రింగ్ రోడ్డు దాటింది. రామోజీ ఫిల్మ్ సిటీ కూడా దాటుకొని అబ్దుల్లాపూర్ మెట్ దాటి వెళ్తుండగా, అడ్డుగా మరో కారు వచ్చి ఆగింది. సడన్‌గా నిలిపాల్సి వచ్చింది. వారు ఏం జరిగిందోనని తేరుకునేలోగా ముందు కారులోంచి ఫైల్‌మ్యాన్లు రానే వచ్చారు. బయట నుంచి కారు డోర్లు కొడుతూ దబాయింపు మొదలు పెట్టారు.
latest Telugu news: ఏమైందని బయటకు చూసే సరికి దూషణలు లంకించుకున్నారు. షాక్ కావడం ఆ కుటుంబం వంతయింది. అతని భార్య అవమాన భారంతో కుంగిపోయింది. పిల్లలు తెల్లమొహం వేసి చూస్తున్నారు. ఆ కారు వ్యక్తి వారిని బతిమిలాడుతున్నాడు. అన్నా.. కొంచెం టైమివ్వండి.. భార్యా, పిల్లలతో ఊరికి వెళ్తున్నాం.. తిరిగి రాగానే కిస్తీ చెల్లిస్తా.. అని వేడుకున్నాడు. ససేమిరా.. అని వారు దబాయింపే చేస్తున్నారు.
latest Telugu news: ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. కుటుంబ పరిస్థితుల కారణంగానో, సరిపోను వేతనం అందకనో, ఇతర సర్దుబాట్ల కారణంగానో కానీ ఆ కుటుంబానికి పెండింగ్ ఈఎంఐలు మిగిలిపోయాయి. దీంతో ఉన్నఫలంగా ఊరికి వెళ్తుంటే రికవరీ ఏజెంట్లమంటూ కారును ఆపేశారు. కారు దిగి వెళ్లండి అని ఆ కుటుంబానికి హెచ్చరికలే జారీ చేశారు. ఊరి నుంచి వచ్చాక మొత్తం తిరిగి చెల్లిస్తానని, రోడ్డుపై పరువు తీయొద్దని ఆ రికవరీ ఏజెంట్లను ఆ వ్యక్తి వేడుకున్నాడు.
latest Telugu news: అయినా ఆ మొద్దు మెదళ్లు కరగలేదు.. కదా.. దబాయింపు ఆపనూ లేదు. కారులోనే కూర్చొని ఉన్న భార్యా, పిల్లలను బెదిరింపులతో దింపేశారు. కారును లాక్కొని పెండింగ్ ఈఎంఐలు చెల్లించి, తీసుకెళ్లు.. అంటూ ఆ కుటుంబం కారును తీసుకొని ఆ రికవరీ ఏజెంట్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ కుటుంబం నడిరోడ్డుపై నిల్చొని ఆవేదనతో కుంగిపోయింది. అవమాన భారంతో కుమిలిపోయింది. ఏడుపే దిక్కయింది ఆ కుటుంబానికి. ఇక చేసేది లేక వెనుదిరిగి నిజాంపేటకు బస్సులో వెళ్లింది ఆ కుటుంబం.
latest Telugu news: కానీ, ఇది ఈ ఒక్క కుటుంబానికే జరిగిన అవమానం.. ఘోరం కాదు.. పలు కుటుంబాలకు నిత్యం ఎదురవుతున్నాయి. ఫైనాన్స్ కంపెనీలు రికవరీ ఏజెంట్లుగా, రౌడీషీటర్లు, పాత నేరస్థులను పెట్టుకొని వసూళ్లకు పాల్పడుతున్నది. వారిలో మానవత్వం కరువై దౌర్జన్యాలకు, దబాయింపులకు దిగుతూ ఇలాంటి అమానుష ఘటనలకు పాల్పడుతూ ఉన్నారు. ఇలా బెదిరింపులకు దిగుతూ, సమాజంలో గౌరవ మర్యాదలు లేకుండా చేసేస్తున్నారు.

