OTT Movies: ఓటీటీ ప్రేక్షకులకు చూడాలనుకునే వారికి చూసినంత కంటెంట్. ఈ వారం దాదాపు 23 సినిమాలు ఓటీటీల్లో కనువిందు చేస్తున్నాయి. వీటిలో థియేటర్లలో సందడి చేసిన సినిమాలతో పాటు డైరెక్టర్ గా రిలీజ్ అయినవి కూడా ఉండటం విశేషం. అమెజాన్ ప్రైమ్ లో శ్రీవిష్ణు ‘స్వాగ్’, హిందీ చిత్రం ‘జ్విగటో’, తమిళ చిత్రం ‘కడైసి ఉలగ పోర్’, డబ్బంగ్ చిత్రం ‘క్లౌడీ మౌంటేన్’, వెబ్ సీరీస్ ‘లైక్ ఎ డ్రాగన్, నౌటిలస్’ స్ట్రీమింగ్ అయ్యాయి.
OTT Movies: నెట్ ఫ్లిక్స్ లో కార్తీ-అరవింద్ స్వామి ‘సత్యం సుందరం’, కృతిసనన్ ‘దోపత్తి’, ఇంగ్లీష్ చిత్రం ‘డోంట్ మూవ్’తో పాటు కొరియన్, స్పానిష్ వెబ్ సీరీస్ ‘హెల్ బౌండ్ సీజన్2, ది లాస్ట్ నైట్ ఎట్ ట్రైమోర్ బీచ్, ఇండోనేషియన్ హారర్ చిత్రం ‘పాసెషన్’ స్ట్రీమింగ్ లో ఉన్నాయి. ఇక జీ5లో ‘ఐందామ్ వేదమ్’ సీరీస్, ‘ఆయ్ జిందగీ’ సినిమా, బుక్ మై షోలో ‘ది ఎక్స్ టార్షన్’ స్పానిష్ చిత్రం, ‘స్ట్రేంజ్ డార్లింగ్’ సినిమాలు, లయన్స్ గేట్ ప్లేలో ‘లెజెండ్ ఇంగ్లీష్ డబ్బింగ్, డెమోనిక్’ ప్లే అవుతున్నాయి. డిస్నీ హాట్ స్టార్ లో ‘ది లెజెండ్ఆఫ్ హనుమాన్ 5’, ఆహాలో ‘అన్ స్టాపబుల్4’, యాపిల్ ప్లస్ లో ‘బిఫోర్’ వెబ్ సీరీస్, జియో సినిమాలో ‘ది మిరండా బ్రదర్స్’తో పాటు రెంటల్ బేసిస్ మీద ‘స్పీక్ నో ఈవిల్’ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి వీటిలో వీక్షకులు ఏ యే సినిమాలకు, సీరీస్ కి పట్టం కడతారో చూడాలి.