Lashkar-e-Taiba: ప్రధాని నరేంద్రమోదీకి లష్కరే తోయిబా ఉగ్రసంస్థ బహిరంగంగా హెచ్చరికలు చేసింది. మే 10న చేసినట్లుగా మరోసారి మోదీకి గుణపాఠం చెప్పాలని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ ను కోరుతూ లష్కరేతోయిబా డిప్యూటీ చీఫ్ , పహల్గాం ఉగ్రదాడి సూత్రదారి సైఫుల్లాహ్ కసూరీ వీడియో విడుదల చేశాడు. పాక్ లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో మునీర్ ను ఫీల్డ్ మార్షల్ గా కసూరీ.. పేర్కొన్నాడు. కావాలనే ఇటీవల భారత్ ఒక్కసారిగా సిందూ జలాల్ని విడుదలచేసి పాకిస్థాన్ లో మెరుపువరదలకు కారణమైందనీ ఈ జలఉగ్రవాదానికి భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ వీడియోలో ఆ ఉగ్రవాది పెట్రేగిపోయాడు.
ఇది కూడా చదవండి: Atla Taddi 2025: రేపే అట్లతద్ది.. పూజా ఇంకా వ్రతం ఇలా చేయండి.!
ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత్ సిందూజలాల విడుదలను నిలిపివేసిందనీ దీన్ని యుద్ధ చర్యగా పరిగణిస్తామని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పదేపదే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు కూడా ఇదే అంశంపై ప్రకటన చేయడం.. ఆ దేశంలో రాజకీయ నాయకత్వం, ముష్కరులు కలిసి సమన్వయంతో కూడిన భారత వ్యతిరేక ప్రచారాన్ని ఎలా కొనసాగిస్తుందో బహిర్గతం చేస్తుంది… గతంలో హఫీజ్ సయీద్ ఒక వీడియోలో, “మీరు పాకిస్తాన్‌కు నీళ్లు ఆపితే, మేము మీ శ్వాస ఆపుతాం… ఆ నదుల్లో మీ రక్తం ప్రవహిస్తుంది” అంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. కాశ్మీర్‌లో ఆనకట్టలు నిర్మించి పాకిస్తాన్‌కు వచ్చే నీటిని అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.