Mysterious Temple: మన భారతదేశం విశ్వాసాలు, మిస్టరీలు, అద్భుతాలపట్ల ప్రసిద్ధి. శతాబ్దాలుగా కొన్ని సంఘటనలు శాస్త్రవేత్తలకే ఓ బిరుదుగా మారాయి. అలాంటి అద్భుతాలలో ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాజాపూర్ జిల్లాలోని గడియాఘాట్ వలీ మాతాజీ ఆలయం. ఇక్కడ నూనె గానీ నెయ్యి గానీ కాకుండా, కేవలం నీటితో దీపాలు వెలుగుతాయి! వినగానే ఆశ్చర్యంగా ఉంది కదూ? ఐతే దీని వెనుక ఉన్న విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
దీపానికి నూనె లేదు, నీరే చాలు!
షాజాపూర్‌కు 15 కిలోమీటర్ల దూరంలో నల్ఖేడా సమీపంలోని ఈ ఆలయం కాళీసింధ్ నది ఒడ్డున ఉంది. ప్రతి సాయంత్రం ఇక్కడ పూజారులు దీపాల్లో నది నీటిని పోస్తారు. కొద్ది సేపటికి ఆ నీరు జిగటగా మారి, దీపం వెలగడం మొదలవుతుంది. ఉదయం ఆ దీపాలు స్వయంగా ఆరిపోతాయి. ఈ ప్రక్రియ ఏళ్ళుగా కొనసాగుతోంది.
శాస్త్రవేత్తలకూ చిక్కని చిక్కు
ఈ నీటి రహస్యాన్ని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఎన్నోసార్లు పరిశోధనలు చేశారు. ఆ నీటిలోని శాతం, వాటిలో ఉండే రసాయనాలు అన్నీ పరీక్షించారట. కానీ దీపం వెలిగేలా చేసే ఏ ఒక్క మూలకాన్ని కూడా గుర్తించలేకపోయారు. దీంతో ఇది శాస్త్రానికి ఓ సవాలుగా మారింది.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..మరో కొత్త డిస్కం ఏర్పాటు..
ఇది మాతాజీ మహిమ అంటున్నారు భక్తులు
ఆలయ పూజారి, స్థానికులంతా ఇది మాయ లేదా ట్రిక్ కాదని, మాతాజీ కృప వల్లే ఇది జరుగుతోందని విశ్వసిస్తున్నారు. ఇదే నీటిని బయట ఎక్కడైనా వాడినా దీపం వెలగదు అంటారు. అంటే ఇది మాతాజీ ఆలయంలో మాత్రమే పనిచేసే ఓ దేవీశక్తిగా భావిస్తున్నారు.
వర్షాకాలంలో దీపాలు వెలగవు! ఎందుకంటే…
వర్షాకాలంలో కాళీసింధ్ నది ఉద్ధరించడం వల్ల ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. ఆ సమయంలో పూజలు కూడా జరగవు. నీరు తగ్గిన తర్వాతే మళ్లీ దీపాలు వెలుగుతాయి. అప్పటి నుంచి వచ్చే వర్షాకాలం వచ్చేంత వరకు ఈ దీపాలు అఖండంగా వెలుగుతూనే ఉంటాయి.
విశ్వాసమా? విజ్ఞానమా?
ఈ అద్భుతం మనలో చాలా మందిలో ఓ ప్రశ్నను రేపుతుంది – ఇది నిజంగా మాతాజీ శక్తియేనా? లేదా ఇప్పటికీ శాస్త్రవేత్తలు చూడలేని ఏదైనా ప్రక్రియ ఉందా? దీనికి సమాధానం ఇప్పటికీ తెలియని మిస్టరీగానే మిగిలిపోయింది.
ఒక్కసారి మనమూ దర్శించేద్దాం!
ఇలాంటి అద్భుతాలు మనం పుస్తకాల్లో చదవడం కన్నా ప్రత్యక్షంగా చూడడంలోనే అసలైన అనుభూతి ఉంటుంది. షాజాపూర్‌కు వెళ్లే అవకాశం వస్తే, ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. నీటితో వెలిగే దీపాలను మీ కళ్లతో చూడండి.