Lalu Prasad yadav: కుంభమేళా అర్థరహితం.. షాకింగ్ కామెంట్స్ చేసిన లాలు..

Lalu Prasad yadav: కుంభమేళా రద్దీ కారణంగా ఢిల్లీలోని రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటపై రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో 18 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు.

లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ, ఈ తొక్కిసలాటకు రైల్వే శాఖనే పూర్తిగా బాధ్యత వహించాలని, రైల్వే మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘ఇది రైల్వే విభాగం పూర్తిగా వైఫల్యానికి నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయకపోవడంతోనే ఈ విషాదకర ఘటన జరిగింది,’ అని ఆయన విమర్శించారు.

అలాగే, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్లడంపై మీడియా ప్రశ్నించగా, ‘కుంభమేళాకు ఎలాంటి అర్థం లేదు. ఇది పూర్తిగా అర్థరహితం’ అని లాలూ వ్యాఖ్యానించారు.

ఈ ఘటనపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. ‘ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్లే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి రాజీనామా చేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *