Lalbaugcha Raja Look: హైదరాబాద్ వాసులకు ఖైరతాబాద్ వినాయకుడు ఎంత ఫేమస్ అనాది అందరికి తెలిసిందే.. అలాగే ముంబై ప్రజలకు అంతే ప్రాముఖ్యం లాల్‌బాగ్చా రాజా గణనాథుడికి ఉంటుంది. దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన గణేశ విగ్రహాల్లో ఇది అగ్రస్థానంలో నిలుస్తుంది.
1934 నుంచి ముంబైలోని లాల్‌బాగ్చా మార్కెట్‌లో ప్రతిష్టించబడుతున్న ఈ గణనాథుడు, సంవత్సరాలుగా భక్తుల కోరికలు తీర్చే దేవుడిగా పేరుపొందాడు. ఈసారి కూడా నిర్వాహకులు 2025 వినాయక చవితి సందర్భంగా లాల్‌బాగ్చా రాజా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఈ గ్లింప్స్ ఇప్పటికే ట్రెండింగ్‌లో నిలిచింది.
అద్భుతమైన లుక్ – కళాత్మక రూపకల్పన
ప్రతి ఏడాది లాల్‌బాగ్చా రాజాను ప్రత్యేక శిల్పకళ, వాస్తు సూత్రాలతో తీర్చిదిద్దుతారు. ఈసారి కూడా అదిరిపోయే లుక్‌తో గణనాథుడు భక్తులను ఆకట్టుకుంటున్నాడు. గణపతిని చూసేందుకు ముందుగానే వేలాది మంది భక్తులు క్యూలో నిలుస్తున్నారు.
ప్రముఖుల రద్దీ – వీఐపీ పాసుల సదుపాయం
రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు ప్రతీ ఏడాది ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో, నిర్వాహకులు వీఐపీ పాస్ సదుపాయాన్ని కూడా కల్పించారు.
వేడుకల వైభవం
ఈ ఏడాది ఆగస్టు 27న గణనాథుడిని ప్రతిష్టించగా, సెప్టెంబర్ 6 వరకు అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ కాలంలో లక్షలాది భక్తులు ముంబై లాల్‌బాగ్ ప్రాంతానికి చేరుకుంటారు.
గణనాథుడి ఆధ్యాత్మిక ప్రాధాన్యం
గణనాథుడు జ్ఞానం, శ్రేయస్సుకు ప్రతీక. ఏ పూజ ప్రారంభించే ముందు అడ్డంకులు తొలగించాలంటే ముందుగా గణనాథుడినే పూజించడం ఆనవాయితీ. లాల్‌బాగ్చా రాజా కూడా భక్తుల కోరికలు తీర్చే దేవుడిగా పేరుపొందాడు.
1934లో మొదలైన ఈ ఉత్సవం, ఇప్పుడు దేశవ్యాప్త ఆధ్యాత్మిక వేడుకగా మారింది. మార్కెట్ ప్రాంతంలోని మత్స్యకారులు, మిల్లు కార్మికుల నుండి మొదలైన ఈ సంప్రదాయం, ఇప్పుడు ముంబైతో పాటు దేశమంతా భక్తులను ఆకర్షిస్తోంది.
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ముంబయిలోని ‘లాల్ బాగ్చా రాజా’ గణేశుడి లుక్ ను నిర్వాహకులు రివీల్ చేశారు.
ముంబైలో గణేష్ నవరాత్రి వేడుకలంటే ముందుగా గుర్తుకు వచ్చేది లాల్‌బాగ్చా రాజా.
1934 నుంచి లాల్‌బాగ్ మార్కెట్‌లో కొలువుదీరే ఈ గణనాథుడి ఉత్సవం ప్రతి ఏడాది అత్యంత ఘనంగా జరుగుతూ… pic.twitter.com/tdpjr3T9In
— s5news (@s5newsoffical) August 25, 2025