సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్ర లేఖ రాశారు. తన ఫామ్‌హౌస్‌కు అధికారులను పంపించాలని FTL, బఫర్ జోన్‌లో నిర్మాణాలు ఉంటే మార్క్ చేయాలని సూచించారు.
తన సొంత ఖర్చులతో వాటిని కూల్చేస్తానని లేఖలో తెలిపారు. తనకు చట్టం నుంచి ఎలాంటి మినహాయింపులు అవసరం లేదని చట్టాన్ని తన పని తాను చేసుకుపోనివ్వండని కేవీపీ సూచించారు.

