Khushboo: సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ చార్మినార్ వద్ద నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఈ వేడుకల్లో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ సందర్భంగా ఖుష్బూ గౌరమ్మకు కుంకుమ పూజ చేసి, తెలంగాణ మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక చిహ్నమని, మహిళల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు.
వేడుకలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్, బీజేపీ నాయకురాలు బండ కార్తీక రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు. బతుకమ్మను తిలకించేందుకు, ఆడటానికి భారీ సంఖ్యలో మహిళలు తరలివచ్చి సందడి చేశారు.