PM Modi Tour: ప్రధాని మోదీ కర్నూలు జిల్లా పర్యటన కోసం ఏర్పాట్లు దాదాపు పూర్తి కావస్తున్నాయి. ఈనెల 16న ప్రధాని ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం కర్నూలుకు చేరుకుని… నన్నూరు టోల్ గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. దీనికోసం 7,500 మంది పోలీసులతో పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. 450 ఎకరాల్లో బహిరంగ సభ, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేస్తున్నారు.
మరోవైపు కర్నూలులో ఈనెల 16న జరిగే సూపర్ GST-సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి రావాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. దిల్లీలో ప్రధాని మోదీతో సుమారు 45 నిముషాల పాటు చంద్రబాబు భేటీ అయ్యారు.
ఇది కూడా చదవండి: Maganti Sunitha: జూబ్లీహిల్స్ బిఆర్ఎస్ అభ్యర్థిపై కేసు నమోదు
చంద్రబాబు వెంట కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. కర్నూలులో జరిగే… ‘సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్’ కార్యక్రమానికి అధికారికంగా ప్రధానిని ఆహ్వానించారు.
నవంబర్ 14, 15వ తేదీల్లో విశాఖలో జరిగే..సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని కోరారు. ప్రభుత్వాధినేతగా ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని మోదీకి అభినందనలు తెలిపినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ లో చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రజలకు మేలు చేసేలా..GST సంస్కరణలు తీసుకురావడంపై రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు చెప్పినట్లు తెలిపారు.