Kurnool: కర్నూలు జిల్లా ప్రజలకు పోలీసుల హెచ్చరిక: అంతర్రాష్ట్ర దొంగల ముఠా సంచారం

Kurnool:  ఎమ్మిగనూరు, నందవరం మంలాల్లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా చురుగ్గా సంచరిస్తుందంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ దొంగల ముఠా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా సూచించారు. ఈ సందర్భంగా ఐదుగురు దొంగల ఫోటోలను పోలీసులు విడుదల చేశారు.

అప్రమత్తత సూచనలు:

రాత్రిపూట తలుపులు, తాళాలు సరిగా వేసుకున్నారా అన్నది చెక్ చేయండి.అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీస్ స్టేషన్‌కు తక్షణం సమాచారం అందించండి.అపరిచిత వ్యక్తులను ఇంట్లోకి అనుమతించే ముందు జాగ్రత్తలు పాటించండి.

ఈ హెచ్చరికను అనుసరించి ప్రజలు పోలీసులకు సహకరించాలి. అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు తెలిపారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *