Kurnool Bus Tragedy

Kurnool Bus Tragedy: కర్నూలు బస్సు దుర్ఘటన.. రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన హోం మంత్రి

Kurnool Bus Tragedy: కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు మంటల్లో చిక్కుకుని 19మంది దుర్మరణం పాలయ్యారు. 21మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సులో మొత్తం 41మంది ప్రయాణిస్తున్నారు. వారిలో ఇద్దరు చిన్నారులు, 10మంది మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ప్రమాదం ఇలా జరిగింది

సాక్షుల ప్రకారం, బస్సు ముందుగా వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో ఆ బైక్‌ కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఆ సమయంలో పెట్రోల్‌ ట్యాంక్‌ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్ని క్షణాల్లోనే బస్సును చుట్టేసింది. బస్సు పూర్తిగా దగ్ధమై గుర్తుపట్టలేని స్థితికి చేరింది.

రక్షణ చర్యలు

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని కర్నూలు జీజీహెచ్‌ మరియు ఆకాశ్‌ ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం ఆరుగురికి జీజీహెచ్‌లో, ముగ్గురికి ఆకాశ్‌లో చికిత్స కొనసాగుతోంది.

హోంమంత్రి అనిత స్పందన

ప్రమాదంపై హోంమంత్రి అనిత అత్యవసరంగా ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. “ఒక మృతదేహాన్ని ఇంకా గుర్తించాల్సి ఉంది. 16 ఫోరెన్సిక్‌ బృందాలను ఏర్పాటు చేశాం. బస్సు డ్రైవర్లు పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రమాదంపై విచారణకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నాం,” అని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Salman: మద్యం తాగి బిగ్ బాస్ కి వచ్చిన సల్మాన్?

ఆ కమిటీలో పోలీసు, రవాణా, రెవెన్యూ శాఖ అధికారులు ఉంటారని తెలిపారు. “ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటాం. బాధిత కుటుంబాలతో మాట్లాడుతున్నాం,” అని హోంమంత్రి తెలిపారు.

బస్సు వివరాలు

బస్సుకు ఆల్‌ ఇండియా పర్మిట్‌, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ ప్రమాదంపై నిందితులపై ఇప్పటికే కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం స్పందన

మృతుల కుటుంబాలతో సమన్వయం చేసేందుకు టెలంగాణ ప్రభుత్వం స్పెషల్‌ ఆఫీసర్‌ను పంపింది. ఆయనకు బాధ్యతలు అప్పగించినట్లు హోంమంత్రి తెలిపారు.

మృతుల వివరాలు

ఈ ఘటనలో మృతులలో

  • 6 మంది ఆంధ్రప్రదేశ్‌
  • 6 మంది తెలంగాణ
  • 2 మంది తమిళనాడు
  • 2 మంది కర్ణాటక
  • 1 ఒడిశా, 1 బీహార్‌ వాసులు ఉన్నారని వెల్లడించారు.

కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలు

అశ్విన్‌రెడ్డి(36), జి.ధాత్రి(27), కీర్తి(30) పంకజ్‌(28), యువన్‌ శంకర్‌రాజు(22) తరుణ్‌(27), ఆకాశ్‌(31), గిరిరావు(48), బున సాయి(33), గణేశ్‌(30), జయంత్‌ పుష్వాహా(27) పిల్వామిన్‌ బేబి(64), కిశోర్‌ కుమార్(41) రమేష్‌, అతని ముగ్గురు కుటుంబ సభ్యులు రమేష్‌(30), అనూష(22), మహ్మద్‌ ఖైజర్‌(51), దీపక్‌ కుమార్‌ 24 అన్డోజ్‌ నవీన్‌కుమార్(26), ప్రశాంత్‌(32) ఎం.సత్యనారాయణ(28), మేఘనాథ్‌(25) వేణు గుండ(33), చరిత్(21), చందన మంగ(23) సంధ్యారాణి మంగ(43), గ్లోరియా ఎల్లెస శ్యామ్(28) సూర్య(24) హారిక(30), శ్రీహర్ష(24) శివ(24), శ్రీనివాసరెడ్డి(40), సుబ్రహ్మణ్యం(26)కె.అశోక్‌(27), ఎం.జి.రామారెడ్డి(50) ఉమాపతి(32), అమృత్‌ కుమార్(18), వేణుగోపాల్‌రెడ్డి(24)

మృతుల్లో బాపట్లకు చెందిన ధాత్రి, కోనసీమకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి, అలాగే నెల్లూరు జిల్లాకు చెందిన ఒకే కుటుంబం నలుగురు ఉన్నట్లు సమాచారం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *