Kurnool Bus Accident:కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రమాదానికి గురైన బస్సు ట్రావెల్స్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వేమూరి కావేరి ట్రావెల్స్ యాజమాన్యంపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటికే బస్సుకు సీటింగ్ పర్మిషన్ మాత్రమే ఉండగా, స్లీపర్ బస్సుగా ఆల్టరేషన్ చేయించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే బస్సు డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా నకిలీదని తేలింది.
Kurnool Bus Accident:ప్రమాదం జరిగిన బస్సు నడిపిన డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యను పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదం జరగగానే బయటి డోర్ సహా డ్రైవర్ క్యాబిన్ డోర్ సైతం ఓపెన్ కాలేదు. దీంతో ఇద్దరు డ్రైవర్లు కుడివైపున ఉన్న డ్రైవర్ డోర్ ద్వారా బయటకు దూకి పరారయ్యారు. తాజాగా బస్సును నడిపిన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా, కీలక విషయం వెలుగు చూసింది.
Kurnool Bus Accident:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా ఒప్పిచర్లకు చెందిన మిరియాల లక్ష్మయ్య ఆ బస్సు డ్రైవర్‌గా చాలా ఏళ్లుగా పనిచేస్తున్నాడని పోలీసులు ధ్రువీకరించారు. అయితే లక్ష్మయ్య కేవలం 5వ తరగతి వరకే చదువుకున్నాడని తేలింది. నకిలీ 10వ తరగతి సర్టిఫికెట్‌తో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందాడని తేల్చారు. ఆ ట్రావెల్స్ లో ఇలాంటి నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌లతో పనిచేసేవారు ఇంకా కొందరున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

