Minister Anitha

Minister Anitha: మహిళపై దాడి: హోం మంత్రి అనిత స్పందన – న్యాయం చేస్తామని హామీ

Minister Anitha: అప్పు తీర్చలేదన్న కారణంతో ఓ మహిళను చెట్టుకు కట్టేసిన అమానుష ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. కుప్పం మండలం నారాయణపురంలో జరిగిన ఈ దారుణం గురించి తెలియగానే, ఆమె వెంటనే బాధితురాలిని పరామర్శించారు. కుప్పం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలితో వీడియో కాల్ ద్వారా మాట్లాడి ధైర్యం చెప్పారు.

ఈ సంఘటన తన దృష్టికి రాగానే, బాధితురాలితో వీడియో కాల్ ద్వారా మాట్లాడి, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చినట్లు మంత్రి అనిత తెలిపారు. బాధితురాలితో మాట్లాడిన వీడియోను కూడా ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను బాధితురాలి ద్వారా అడిగి తెలుసుకున్నానని మంత్రి పేర్కొన్నారు.

Also Read: Murali Nayak: మంత్రి సవిత చేతుల మీదుగా వీర జవాన్ మురళీ కుటుంబానికి ప్రభుత్వ పరిహారం

నిందితులపై కఠిన చర్యలకు ఆదేశాలు
ఈ ఘటనపై తక్షణమే చర్యలు చేపట్టాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్.మణికంఠ చందోలుతో ఆమె ఫోన్‌లో మాట్లాడారు. ఘటనపై సమగ్ర నివేదికను వెంటనే తనకు సమర్పించాలని ఎస్పీని ఆదేశించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా, బాధితురాలికి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని, ఈ అమానుషానికి పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఎస్పీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు హోంమంత్రి తెలిపారు.

Minister Anitha: రాష్ట్రంలో మహిళల భద్రతకు, వారి ఆత్మగౌరవానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని ఆమె స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని పునరుద్ఘాటించారు. ఇలాంటి చర్యలు మళ్లీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *