Kubera: టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగిస్తున్న ‘కుబేర’ సినిమా ట్రైలర్ రిలీజై, అంచనాలను రెట్టింపు చేసింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా కలిసి నటించిన ఈ చిత్రం నుంచి వచ్చిన ట్రైలర్ అదిరిపోయింది. శేఖర్ సహజ శైలి ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. ధనుష్-నాగార్జున పాత్రల మధ్య సస్పెన్స్ ఆకట్టుకుంటోంది.
Also Read: The RajaSaab Teaser: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ టీజర్ వచ్చేసింది..ఫ్యాన్స్ కు పూనకాలే
Kubera: ఒక బిచ్చగాడు ఎలా అందలమెక్కాడు? వారి మధ్య ఏం జరిగింది? అనే ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. రష్మిక పాత్రకు కూడా కీలక ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, విజువల్స్ ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు.
