Kubera: తమిళ సూపర్‌స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న కాంబోలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘కుబేర’ సినిమా తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచినా, తమిళనాడులో ఘోరంగా విఫలమైంది. జూన్ 20న గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరగా, తమిళనాడులో మాత్రం కేవలం రూ. 18 కోట్ల గ్రాస్ వసూళ్లతో నీరసించింది. రూ. 48 కోట్ల ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్‌తో అడుగుపెట్టిన ‘కుబేర’, సుమారు రూ. 30 కోట్ల నష్టాన్ని మిగిల్చినట్లు సమాచారం.
Also Read: Thammudu: నితిన్ కి బిగ్ టార్గెట్.. తమ్ముడు హిట్ కొట్టాలంటే ఎన్ని కోట్లు కొల్లగొట్టాలో తెలుసా?
Kubera: ధనుష్ కెరీర్‌లోనే ఇది అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. తమిళ ప్రేక్షకులతో కనెక్ట్ కాకపోవడం, కథలో కొత్తదనం లేకపోవడం ఈ వైఫల్యానికి కారణాలుగా చెబుతున్నారు. శేఖర్ కమ్ముల కూడా తమిళనాడులో సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేదని విచారం వ్యక్తం చేశారు. అయితే, అమెజాన్ ప్రైమ్ వీడియో రూ. 50 కోట్లకు ఓటీటీ రైట్స్ సొంతం చేసుకోవడం నిర్మాతలకు కొంత ఊరటనిచ్చింది.
