Kubera Release Date: ధనుష్ హీరోగా శేఖర్ కమ్ములతో చేస్తున్న చిత్రం ‘కుబేర’. ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా రిలీజ్ మాత్రం ఎప్పుడు రిలీజ్ అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఈ చిత్రం కోసం ధనుష్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ మధ్య ఈ సినిమా జూన్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా టాక్ వచ్చింది.కానీ ఫైనల్ గా ఈ సినిమాకి కొత్త డేట్ ఫిక్స్ అయ్యినట్టుగా టాక్ వినిపిస్తుంది. దీని ప్రకారం కుబేర సినిమా జూన్ 20న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానున్నట్టు తెలుస్తుంది. ఇది దాదాపు ఫిక్స్ అని అధికారిక ప్రకటన కూడా త్వరలో రానుంది అని టాక్. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా కింగ్ నాగార్జున సాలిడ్ రోల్ చేస్తున్నారు. అలాగే రష్మిక మందన్నా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.