Ktr: TS-iPASS విధానాన్ని ప్రశంసించిన నీతి ఆయోగ్

Ktr: తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి భారీగా తోడ్పడిన TS-iPASS విధానానికి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. నీతి ఆయోగ్ తాజా నివేదికలో ఈ విధానాన్ని అత్యుత్తమ నమూనాగా అభివర్ణించడం రాష్ట్రానికి గర్వకారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు.

కేసీఆర్ రూపకల్పన చేసిన TS-iPASS ద్వారా రాష్ట్రం పెట్టుబడుల రంగంలో దేశానికి దిక్సూచి అయిందని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అడ్డంకులను తొలగిస్తూ, సింగిల్ విండో విధానంలో 15–30 రోజుల్లో అన్ని అనుమతులు మంజూరు చేసే పారదర్శక వ్యవస్థను తెలంగాణ తీసుకొచ్చిందని గుర్తుచేశారు.

పది ఏళ్ల కాలంలో ఈ విధానం ద్వారా రాష్ట్రానికి రూ. 2.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ప్రత్యక్షంగా–పరోక్షంగా 25 లక్షల మందికి ఉపాధి లభించిందని కేటీఆర్ వివరించారు. భారీ కంపెనీలతో పాటు చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలపైన కూడా TS-iPASS ప్రభావం చూపిందని తెలిపారు.

రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, టీ-హబ్ వంటి కార్యక్రమాలకు గతంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కినట్లే ఇప్పుడు TS-iPASS విధానం కూడా అటువంటి నిలువెత్తు గుర్తింపు పొందిందని ఆయన అన్నారు.

ఈ విజయాలను చిన్నచూపు చూడటం తగదని, తెలంగాణ అభివృద్ధి మోడల్‌ను నీతి ఆయోగ్ గౌరవంగా గుర్తించినప్పటికీ ప్రభుత్వాన్ని విమర్శించే రాజకీయ శక్తులు వాస్తవాలను అర్థం చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. కేసీఆర్ గారి పరిపాలనా ఆనవాళ్లను చెరిపేయడం అసాధ్యమని ఆయన హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *