Ktr: జన్వాడ ఫామ్ హౌస్.. కేటీఆర్ రియాక్షన్ ఇదే

Ktr: జ‌న్వాడ ఫామ్‌హౌస్ ఘ‌ట‌న‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ స్పందించారు.కుట్ర‌ల‌తో తమ గొంతు నొక్క‌లేర‌న్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకే త‌మ బంధువుల‌పై కేసులు బ‌నాయిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

Ktr: “వృద్ధులు, పిల్ల‌ల‌తో స‌హా కుటుంబ స‌భ్యులు, బంధుమిత్రుల‌తో క‌లిసి ఉంటే దాన్ని రేవ్ పార్టీ అని ప్ర‌చారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. అస‌లు రేవ్ పార్టీ అంటే అర్థం తెలుసా? పార్టీలో అస‌లు మాద‌క‌ద్ర‌వ్యాలు దొర‌క‌లేదు. మా ప్ర‌శ్న‌ల‌కు రాజ‌కీయంగా స‌మాధానం చెప్ప‌లేక కుట్ర‌ల‌కు తెర‌లేపారు.

ఆరు గ్యారెంటీలు అమ‌లు చేయ‌లేక మా కుటుంబ స‌భ్యులు, బంధువులపై కేసులు పెడుతున్నారు. ఉద్య‌మంలో అడుగుపెట్టిన రోజే చావుకు తెగించి వ‌చ్చాం. ఇలాంటి కేసుల‌కు భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేదు. నా బావ‌మ‌ర్ది రాజ్ పాకాల ఉంటున్న సొంత ఇంట్లో దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా దావ‌త్ చేసుకోవ‌డం త‌ప్పా గృహ ప్ర‌వేశం సంద‌ర్భంగా బంధువుల‌ను పిలిచి దావ‌త్ ఇచ్చారు.

చేత‌నైతే రాజ‌కీయంగా త‌ల‌ప‌డండి. ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయండి.మా ధైర్యాన్ని దెబ్బ‌తీయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. కుట్ర‌లు చేసి మా గొంతునొక్కాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇదంతా చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. మూసి కుంభ‌కోణం, 100 రోజుల్లో అమ‌లు చేస్తామ‌న్న హామీలు, బావ‌మ‌ర్దికి ఇచ్చిన కాంట్రాక్టు వ్య‌వ‌హారంతో పాటు అనే కుంభ‌కోణాల‌ను బీఆర్ఎస్ బ‌య‌ట‌పెట్టిందని” అని కేటీఆర్ అన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Rajnath Singh: మోదీ గురించి మాకు తెలుసు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *