KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఇంటికే పరిమితం కాగా, కేటీఆర్ పార్టీలో క్రియాశీలకం అయ్యారు. ఆయనే అంతా అయి పార్టీని నడిపిస్తున్నారు. పార్టీ క్యాడర్‌కు, నాయకత్వానికి ఆయన భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. కేసీఆర్ ఆదేశాలను పాటిస్తూ, హరీశ్‌రావు ఇతర కీలక నేతలను సమన్వయం చేసుకుంటూ పార్టీ నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ పార్టీలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
KTR: పార్టీ బలోపేతంపై కేటీఆర్ ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో జిల్లాల పర్యటనకు ఆయన సిద్ధమవుతున్నారు. త్వరలో జిల్లాల్లో పర్యటించాలని, దానికోసం ప్రణాళికలను రచిస్తున్నట్టు తెలిసింది. కేటీఆర్ సోదరి అయిన కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పార్టీ క్యాడర్‌లో నెలకొన్న గందరగోళానికి తెరదించాలని నేతలు నిర్ణయించారు.
KTR: మరోవైపు పార్టీని వీడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలను టార్గెట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసి ఎన్నికలకు క్యాడర్‌ను సంసిద్ధం చేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసే పనిలో పడ్డారు. అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేటీఆర్ ప్రణాళికలను సిద్ధం చేశారు.