KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయంతో ఆ పార్టీ క్యాడర్‌లో జోష్ నిండుకున్నది. ఇప్పటివరకూ ప్రతిపక్ష పాత్రలో భాగంగా వివిధ సమస్యలపై ప్రభుత్వం పోరాడుతూ వస్తున్న ఆయన కార్యకర్తలతో చేరువయ్యే ప్లాన్ చేశారు. ఓటమి తర్వాత నుంచి బీఆర్ఎస్ కీలక నేతలు నియోజకవర్గాలకు కానీ, కార్యకర్తల చెంతకు కానీ వెళ్లకలేకపోయారు. దీంతో ఆ లోటును భర్తీ చేసేందుకు కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ మేరకు ఆయన రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు.
KTR: బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలను పురస్కరించుకొని కేటీఆర్ రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారని తెలిసింది. సోమవారం అసెంబ్లీ సమావేశాలకు ముందే కేటీఆర్ పార్టీ శ్రేణులతో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయం ప్రకటించారు. అలాగే బీఆర్ఎస్ రజతోత్సవాల విజయవానికి పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం రాష్ట్ర పర్యటనకు వెళ్లేందుకు కేటీఆర్ సిద్ధంగా ఉన్నారు.
KTR: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించేందుకే కేటీఆర్ మొగ్గుచూపారు. రాష్ట్రప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు చేపట్టే పోరాట మార్గాలను పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తారని ఆ పార్టీ ముఖ్యుడొకరు చెప్పారు. అదే విధంగా సాగు, తాగునీటి ఇక్కట్లపై ప్రజల తరఫున ఉండి, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటాల్లో భాగస్వాములు కావాలని పార్టీ శ్రేణులకు నూరిపోస్తారని చెప్పారు.
KTR: ఈ మేరకు తొలుత ఈ నెల 20న సూర్యాపేట జిల్లా, ఆ తర్వాత 23న కరీంనగర్ జిల్లాల్లో పర్యటించి, బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం అవుతారు. ఇతర జిల్లాల పర్యటన తేదీలను కూడా త్వరలో ప్రకటిస్తారని సమాచారం. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేలోగా కేటీఆర్ పర్యటన షెడ్యూల్ కూడా సిద్ధమవుతుందని, రాష్ట్రవ్యాప్తంగా కలియదిరిగేలా ప్రణాళిక ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెప్పాయి.
KTR: బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం అవుతారని ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నిండుకున్నది. ఓటమి తర్వాత డీలాపడిపోయిన క్యాడర్‌లో మనోధైర్యం నింపేందుకు వెళ్తుండటంతో ఆనందంలో ఉన్నారు. త్వరలో జరిగే స్థానిక ఎన్నికలకు క్యాడర్‌ను సంసిద్ధం చేసేలా కూడా ఈ కేటీఆర్ పర్యటన అక్కరకొస్తుందని కూడా బీఆర్ఎస్ అధిష్టానం, ముఖ్యనేతలు భావిస్తున్నారు.